Header Banner

తిరుమల మాజీ డీఎస్పీ అధికార దుర్వినియోగం బహిరంగం! వివరణ లేకుంటే కఠిన చర్యలు!

  Sat Feb 22, 2025 16:31        Politics

తిరుమల డీఎస్పీగా పనిచేసిన టిటి ప్రభాకర్ బాబు పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలకు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఆగష్టు నుండి 2020 నవంబర్ వరకు తిరుమల డీఎస్పీగా సేవలందించిన ప్రభాకర్ బాబు, తన విధుల్లో అనేక వివాదాస్పద చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ బాబు, తిరుమలలోని కాటేజీల మధ్య తనకు కేటాయించిన వసతిగృహంలో కోడి పుంజులను పెంచినట్లు గుర్తించారు. ఈ కోడి పుంజుల అరుపులు మరియు విసర్జితాలతో భక్తులకు ఇబ్బందులు కలగడంతో, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అదనంగా, కోళ్ళకు స్నానాలు చేయించి, దాణా పెట్టేందుకు కానిస్టేబుళ్లను వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పాల బిల్లు అడిగినందుకు..
పాల బిల్లు అడిగినందుకు వాహనం పై 2 వేల జరిమానా విధించారు. తన నివాసానికి పాలు సరఫరా చేసే వ్యక్తికి 9 నెలల పాటు బిల్లు చెల్లించకపోవడం, అడిగినందుకు అతని వాహనంపై 2,000 రూపాయల జరిమానా వేయించడం వంటి చర్యలు కూడా ఆయనపై ఆరోపణలుగా ఉన్నాయి.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 


తన డ్రైవర్ నే తనను హత్య చేయబోయినట్టు….
తన వాహన డ్రైవర్‌గా పనిచేసే హోంగార్డును ఒక రోజంతా వేడెక్కేలా డ్రైవ్ చేయించి, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి తనను హత్య చేయడానికి ప్రయత్నించాడంటూ ఆ హోంగార్డుపై కేసు పెట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి, ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే టీటీడీ డెప్యూటీ ఈవోతో సహా 40 మంది పై కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
ఈ ఆరోపణలపై ప్రభాకర్ బాబు 15 రోజుల్లోగా లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన జీఓలో పేర్కొంది. ప్రస్తుతం, ప్రభాకర్ బాబు అదనపు ఎస్పీ హోదాలో వీ ఆర్ లో ఉన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు



పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #thirumala #dgp #notice #todaynews #flashnews #latestupdate